bjp: గోవులను తరలించేవారిని, వధించే వారిని చంపేస్తాం: బీజేపీ ఎమ్మెల్యే గ్యాన్ దేవ్

షార్ట్స్‌లో చూడండి
రాజస్థాన్ లోని రామ్ ఘర్ బీజేపీ ఎమ్మెల్యే గ్యాన్ దేవ్ అహుజా మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోవులను తరలించినా, వధించినా చంపేస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అల్వార్ లో గోవులను స్మగ్లింగ్ చేస్తున్న వారిపై దాడి చేసిన ఘటన గురించి విలేకరులు ప్రస్తావించిన సందర్భంలో ఆయన పైవిధంగా వ్యాఖ్యలు చేశారు.

 గోవులను స్మగ్లింగ్ చేస్తున్న వారిపై ఎవరూ దాడి చేయలేదని, ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. కాగా, గోవులను తరలిస్తున్న ట్రక్కు ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకుని రామ్ ఘర్ వైపు దూసుకుపోయింది. అయితే, యాదవ్ నగర్ వద్ద ఆ ట్రక్కును స్థానికులు పట్టుకున్నారు. అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులను చితకబాదారు. 
Go Back to Shorts
bjp
rajasthan

More Telugu News