కేటీఆర్ ట్విట్టర్ కామెంట్ పై స్పందించిన రేవంత్ రెడ్డి!

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డిపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తప్పుబడుతూ ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేయగా, మంత్రి దీనిపై స్పందించడం విదితమే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి  ప్రతిస్పందిస్తూ, కేటీఆర్ వ్యాఖ్యలు గురివింద సామెతను గుర్తు చేస్తున్నాయని, తనపై వ్యాఖ్యానించే ముందు, లక్ష్మారెడ్డి ఏం మాట్లాడారో కేసీఆర్ తెలుసుకోవాలని సూచించారు. ‘నాపై లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ సమర్థిస్తున్నారా? లక్ష్మారెడ్డిపై చర్యలు తీసుకుని నా గురించి మాట్లాడాలి’ అని మీడియాతో అన్నారు. 
Go Back to Shorts
KTR
Revanth Reddy

More Telugu News