రేవంత్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించాలి: మంత్రి కేటీఆర్

తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ నెటిజన్ ‘కేటీఆర్ సార్.. దయచేసి స్పందించండి.. ఒక నేత ఇలా మాట్లాడటం సమంజసమేనా?’ అని తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ పై మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ వేదికగా స్పందించారు.

‘గౌరవప్రదమైన తెలంగాణ కేబినెట్ మంత్రిపై చేసిన చౌకబారు వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ గారు లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పందించాలి. మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై వెంటనే స్పందించి చర్యలు చేపట్టారు. ఇలాంటి చర్యలను కేవలం గుజరాత్ ఎన్నికలకు మాత్రమే వారు పరిమితం చేశారేమో చూద్దాం’ అన్నారు కేటీఆర్.  

KTR
Revanth Reddy

More Telugu News