suicide: ప్రేమ వ్య‌వ‌హారం.. ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌!

మహబూబాబాద్‌ పట్టణ శివారులోని సిగ్నల్‌ కాలనీలో శిరీష అనే బాలిక ఆత్మ‌హ‌త్య చేసుకుంది. స్థానిక‌ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోన్న ఆమెకు స్థానిక యువ‌కుడు కార్తీక్‌తో ఏర్ప‌డిన‌ పరిచయం ప్రేమ‌గా మారింది. చివ‌ర‌కు ఆ యువ‌కుడు ఆమెను పెళ్లి చేసుకోన‌ని చెప్పడంతో, శిరీష ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని బెదిరించింది.

ఆ యువ‌కుడు 'నీ ఇష్టం వ‌చ్చిన‌ట్లు చేసుకో..పో' అంటూ తిట్టి పంపించాడు. దీంతో శిరీష పురుగుల మందు తాగింది. మానుకోట ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. స‌ద‌రు ప్రియుడిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.   
suicide
love
mahaboobabad

More Telugu News