Chandrababu: ఎమ్మెల్సీ టికెట్ ఎవరికి కేటాయించినా గెలుపు కోసం సహకరించాలి: సీఎం చంద్రబాబు

  • కర్నూలు జిల్లా నేతలతో చంద్రబాబు భేటీ
  • పోటీ చేసే అవకాశం దక్కని అభ్యర్థులు నిరాశ చెందొద్దు
  • నేతలతో ఈరోజు సాయంత్రం మళ్లీ భేటీ కానున్న చంద్రబాబు
కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టికెట్ ఎవరికి కేటాయించినా ఆ అభ్యర్థి గెలుపు కోసం అందరూ సహకరించాలని సీఎం చంద్రబాబునాయుడు సూచించారు. కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక నిమిత్తం జిల్లాకు చెందిన నేతలతో ఈరోజు ఆయన భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులతో చంద్రబాబు  విడివిడిగా సమావేశమయ్యారు.

పోటీ చేసే అవకాశం దక్కని అభ్యర్థులు నిరాశ చెందవద్దని, భవిష్యత్ లో అవకాశం కల్పిస్తామని వారితో బాబు చెప్పినట్టు సమాచారం. కాగా, ఈ భేటీ అనంతరం, ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటిస్తారని ఊహించినప్పటికీ అలా జరగలేదు. ఈరోజు సాయంత్రం మళ్లీ భేటీ కానున్నారని, ఆ తర్వాతే అభ్యర్థి ప్రకటన ఉంటుందని టీడీపీ నాయకుల సమాచారం.
Chandrababu
mlc

More Telugu News