Narendra Modi: వాజపేయి ఇంటికి వెళ్లి, శుభాకాంక్షలు తెలిపిన మోదీ

  • నేడు వాజపేయి జన్మదినం
  • దేశ గౌరవం పెంచిన నేత అంటూ కొనియాడిన మోదీ
  • ఆయనకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని వేడుకున్న ప్రధాని
భారత మాజీ ప్రధాని వాజపేయి నివాసానికి ప్రధాని మోదీ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వాజపేయి కుటుంబ సభ్యులతో కాసేపు గడిపారు. అంతకు ముందు ఆయన ట్వీట్ కూడా చేశారు.

'మన ప్రియతమ నేత అటల్ జీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ముందు చూపు, దార్శనిక నాయకత్వంతో భారత్ అభివృద్ధి పథంలో పయనించింది. ప్రపంచ వేదికపై మన ఔన్నత్యాన్ని మరింత పెంచింది. వాజపేయికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నా' అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 
Narendra Modi
atal biharee vajpayee

More Telugu News