sekhar mastar: చిరూ మెచ్చుకుని గిఫ్ట్ ఇచ్చారు .. ఎన్టీఆర్ కి నేనెంతో రుణపడి వున్నాను:శేఖర్ మాస్టర్

  • చిరూ ఎంతగానో మెచ్చుకున్నారు 
  • ఎన్టీఆర్ ప్రతి సినిమాలోనూ ఛాన్స్ ఇస్తారు 
  • ఆయన కాంబినేషన్లో మంచి సాంగ్స్ పడ్డాయి    
తాజా ఇంటర్వ్యూలో శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ .. తాను పనిచేసిన హీరోలు .. వాళ్లు తనని ఆదరించిన విషయాలను గురించి ప్రస్తావించారు. "చిరంజీవి సినిమాకి పని చేసిన రోజును నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఆయన నాకు అవకాశం ఇవ్వడమే కాకుండా .. 'ల్యాప్ టాప్' గిఫ్ట్ గా కూడా ఇచ్చారు. ఇకపై మనం చేసే సాంగ్స్ అన్నీ కూడా ఈ ల్యాప్ టాప్ లోనే చూడాలి అన్నారు. ఆయన ఇచ్చిన గుర్తింపు నాకు చాలా సంతోషం అనిపించింది" అన్నారు.

'ఇంతవరకూ నేను చేసిన సాంగ్స్ లో ఎక్కువ సాంగ్స్ ఎన్టీఆర్ వే. తన మూవీలో ఒకటి రెండు సాంగ్స్ శేఖర్ చేయాలని అంటారు. నేను ఆయనకి చాలా చాలా రుణపడి వుంటాను. అదృష్టం కొద్దీ ఆయనకి బెస్ట్ సాంగ్స్ చేయగలిగాను. బంతిపూల జానకి .. డైమండ్ గాళ్ .. ఆపిల్ బ్యూటీ .. పక్కా లోకల్ .. స్వింగుజరా సాంగ్స్ .. ఆయనకి బాగా నచ్చినవి .. నాకు మంచి పేరు తెచ్చిపెట్టినవి" అని చెప్పుకొచ్చారు.   
sekhar mastar
chiranjeevi
ntr

More Telugu News