మోదీ భవిష్యత్తును డిసైడ్ చేయనున్న కర్ణాటక.. గుజరాత్ పరిణామాల నేపథ్యంలో మోదీ, షా అలర్ట్
- గుజరాత్ పరిణామాలతో మోదీ, అమిత్ షాలు అలర్ట్
- కాంగ్రెస్ బీజేపీ నేతలపై నెగెటివ్ రిపోర్ట్
- 18 ర్యాలీలకు సిద్ధమవుతున్న మోదీ
ఈ నేపథ్యంలో, కర్ణాటకపై మోదీ, అమిత్ షాలు పూర్తి స్థాయిలో దృష్టి సారించబోతున్నారు. నాలుగు నెలల వ్యవధిలో కర్ణాటకలో 15 నుంచి 18 ర్యాలీలు, సమావేశాల్లో మోదీ పాల్గొననున్నారు. గుజరాత్ పరిణామాల నేపథ్యంలో, కర్ణాటకలో ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా నిర్లక్ష్యం చేయరాదని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించింది. రాష్ట్ర బీజేపీ నేతలు అధికార కాంగ్రెస్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో విఫలమవుతున్నారనే నివేదికలు అందిన నేపథ్యంలో... గెలుపు బాధ్యతలను మోదీ, అమిత్ షాలే తీసుకున్నారు. సుడిగాలి పర్యటనలకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.