chiranjeevi: 'సైరా'లో నరసింహారెడ్డికి కుడి భుజంగా విజయ్ సేతుపతి!

షార్ట్స్‌లో చూడండి
తమిళనాట యువ కథానాయకులతో పోటీపడుతూ విజయ్ సేతుపతి తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఆయనతో నటించడానికి అగ్ర కథానాయికలు సైతం ఆసక్తిని చూపుతుంటారు. ఇక ఆయనతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపుతుంటారు. ఈ కారణంగా తమిళంలో వరుస సినిమాలు చేస్తూ విజయ్ సేతుపతి బిజీగా వున్నాడు. అంతే కాకుండా తెలుగులోను 'సైరా' సినిమా చేయడానికి ఆయన రెడీ అవుతున్నాడు.

దాంతో ఆయన పాత్ర ఎలాంటిదై వుంటుందనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ఈ సినిమాలో ఆయన 'ఓబయ్య' అనే పాత్రలో కనిపించనున్నట్టు తాజా సమాచారం. పోరాట యోధుడైన నరసింహా రెడ్డికి అడుగడుగునా అండగా నిలిచేదిగా ఈ పాత్ర ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా తరువాత తెలుగులోను ఆయన మరిన్ని కీలకమైన పాత్రలను చేసే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో చిరూ సరసన కథానాయికగా నయనతార నటిస్తోన్న సంగతి తెలిసిందే.           
Go Back to Shorts
chiranjeevi
nayantara

More Telugu News