Badminton: వ్యాపారవేత్తను పెళ్లాడిన బ్యాడ్మింటన్ స్టార్ అశ్విని పొన్నప్ప

  • కూర్గులో ఘనంగా జరిగిన వివాహం
  • పూర్తిగా కొడవ సంప్రదాయంలో జరిగిన పెళ్లి
  • హాజరైన పలువురు ప్రముఖులు
భారత బ్యాడ్మింటన్ స్టార్, అంతర్జాతీయ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప వివాహం కర్ణాటకలో ఘనంగా జరిగింది. వ్యాపారవేత్త, మోడల్ అయిన కరణ్ మేడప్పను ఆమె వివాహం చేసుకున్నారు. కొడుగు జిల్లాలోని కూర్గ్‌లో జరిగిన ఈ వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కొడవ సంప్రదాయంలో వీరి పెళ్లి జరిగింది.

 భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుల్లో ప్రముఖంగా చెప్పుకునే వారిలో అశ్విని ఒకరు. 1989లో జన్మించిన అశ్విని హైదరాబాదీ స్టార్ గుత్తా జ్వాలతో కలిసి పలు డబుల్స్ మ్యాచ్‌లు ఆడింది. వీరిద్దరూ కలిసి కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం, వరల్డ్ చాంపియన్ షిప్ పోటీల్లో కాంస్యపతకం సాధించారు.
Badminton
Ashwini Ponnappa
Karan Medappa

More Telugu News