kurnool: కర్నూలు జిల్లా టీడీపీ నేతలతో ముగిసిన చంద్రబాబు సమావేశం.. రేపు మరోసారి భేటీ!

  • రేపు మరోమారు సమావేశం 
  • టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని రేపు ప్రకటించే అవకాశం
  • మీడియాతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
సీఎం చంద్రబాబుతో  కర్నూలు జిల్లా టీడీపీ నేతల సమావేశం ముగిసింది. ఈ సమావేశం సందర్భంగా జిల్లా నేతలు ప్రతి ఒక్కరితోను చంద్రబాబు విడివిడిగా చంద్రబాబు మాట్లాడారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి టీడీపీ అభ్యర్థి ఎంపికపై మరోమారు సమావేశం కానున్నట్టు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. రేపు ఉదయం పదకొండు గంటలకు జిల్లా నేతలతో చంద్రబాబు మరోమారు సమావేశం కానున్నట్టు చెప్పారు.

జిల్లాలోని మరికొందరు నేతలతో చంద్రబాబు మాట్లాడాల్సి ఉందని, అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం, ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. కాగా, శిల్పా చక్రపాణిరెడ్డి  తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి టీడీపీ నుంచి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో, కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి ఖాళీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ పదవికి ఉపఎన్నిక జరగనుంది.
kurnool
Telugudesam

More Telugu News