Subramanya swami: దేశాన్ని ఏలుతున్న పార్టీకి... 'నోటా'కు వచ్చిన ఓట్లలో పావు శాతం కూడా రాలేదు: సుబ్రహ్మణ్య స్వామి

  • ఉప ఎన్నికల్లో ప్రభావం చూపని బీజేపీ
  • కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఇదేంటి
  • లెక్క సరిచూసుకోవాలని ట్విట్టర్ లో వ్యాఖ్య
ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఏ మాత్రం ప్రభావం చూపకపోవడాన్ని ఆ పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి ప్రశ్నించారు. తమిళనాడులో బీజేపీ రికార్డు సాధించిందని ఎద్దేవా చేస్తూ, ఓ జాతీయ పార్టీగా ఉండి, కేంద్రంలో అధికారాన్ని అనుభవిస్తున్న బీజేపీ అభ్యర్థికి, నోటాకు పడ్డ ఓట్లలో పావు వంతు కూడా రాలేదని చెప్పారు.

ఇక తామేం చేస్తున్నామన్న విషయాన్ని బీజేపీ లెక్క చూసుకోవాలని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. టీటీడీ దినకరన్ గెలుపు ఖరారైన నేపథ్యంలో, అతి త్వరలోనే అన్నాడీఎంకే, శశికళ వర్గాలు కలుస్తాయని తాను భావిస్తున్నానని, రెండు వర్గాలూ కలిసి 2019 పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తాయని తాను అంచనా వేస్తున్నట్టు కూడా వ్యాఖ్యానించారు.
Subramanya swami
BJP
Rulling Party
RK Nagar

More Telugu News