Chennai: ఈవీఎంలకు నష్టం లేదు... వదంతులు నమ్మవద్దు: చెన్నై సీపీ

  • పరిస్థితి అదుపులోనే ఉంది
  • గొడవ చేసిందెవరో వీడియో చూసి తేలుస్తాం
  • ఘటనకు కారకులపై కేసులు
  • చెన్నై సీపీ విశ్వనాథన్
చెన్నై పరిధిలోని ఆర్కే నగర్ ఉప ఎన్నికల ఫలితాలను లెక్కిస్తుండగా, అన్నాడీఎంకే, దినకరన్ వర్గాల మధ్య జరిగిన గొడవతో ఈవీఎంలకు నష్టం కలిగిందని అంటూ వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని చెన్నై సీపీ విశ్వనాథన్ ప్రకటించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఒక్క ఈవీఎంకు కూడా నష్టం జరుగలేదని ఆయన స్పష్టం చేశారు.

ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, మరికాసేపట్లో కౌంటింగ్ తిరిగి మొదలవుతుందని తెలిపారు. గొడవ ఎలా జరిగింది? అధికారులపై దాడి చేసింది ఎవరు? తదితర అంశాలను అక్కడి వీడియో ఫుటేజ్ ద్వారా తేలుస్తామని, ఘటనకు కారకులపై కేసులు పెట్టి, వారిని అరెస్ట్ చేస్తామని తెలిపారు.
Chennai
Tamilnadu
RK Nagar
Counting

More Telugu News