director yogi: డైరెక్టర్ యోగిని కొట్టిన అడిషనల్ డీసీపీ గంగిరెడ్డిపై విచార‌ణ త‌రువాత‌ చ‌ర్య‌లు: మాదాపూర్‌ డీసీపీ విశ్వప్రసాద్

షార్ట్స్‌లో చూడండి
షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగి తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడని హారిక అనే యువతి ఫిర్యాదు చేయ‌డంతో మాదాపూర్‌ అడిషనల్ డీసీపీ గంగిరెడ్డి.. యోగిని కొట్టిన‌ట్లు ఓ వీడియో ప్ర‌చారం అవుతోన్న విష‌యం తెలిసిందే. పోలీస్ స్టేష‌న్‌లో గంగిరెడ్డి ఇటువంటి ఘ‌ట‌నకు పాల్ప‌డ‌డం ప‌ట్ల స్పందించిన‌ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ కేసులో మాదాపూర్‌ డీసీపీ విశ్వప్రసాద్ మీడియాతో మాట్లాడారు. అడిషనల్ డీసీపీ గంగిరెడ్డి ప్ర‌వ‌ర్త‌న‌ను త‌ప్పుబ‌ట్టారు. విచారణ తరువాత చర్యలు తీసుకుంటామ‌ని చెప్పారు. ఆ వీడియోని ఎవరు రికార్డు చేశారనే విష‌యంపై కూడా ఆరా తీస్తున్నామ‌ని తెలిపారు.

కాగా, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగి పాల్ప‌డ్డ చ‌ర్య‌ల‌పై డీసీపీ విశ్వ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ.. హారిక‌తో యోగి అసభ్యకరంగా మాట్లాడాడని తెలిపారు. హారిక భర్తకు అభ్యంతరకరమైన మెసేజ్‌లు కూడా సెండ్ చేశాడ‌ని స్ప‌ష్టం చేశారు. 
Go Back to Shorts
director yogi

More Telugu News