roja: యూరప్ లో ఉన్నావిడ చెప్పేంత వరకు నీకు తెలియలేదా?: పవన్ కల్యాణ్ పై రోజా ఫైర్

  • టీడీపీకి నొప్పి కలగకుండా ట్వీట్లు చేశారు
  • దళిత మహిళ గురించి పోరాటం చేసింది వైసీపీనే
  • వైసీపీకి క్రెడిట్ వస్తుందని భయపడుతున్నారు
విశాఖపట్నంలో ఓ దళిత మహిళపై జరిగిన దాడిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ ఉదయం నుంచి వరుసగా ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ, బీజేపీ, వైసీపీలు ఈ ఘటనపై ఒకరిపై మరొకరు బురద చల్లుకోవడం మానేసి... ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏంచేయాలన్న దానిపై అసెంబ్లీలో చర్చించాలని సూచించారు. బాధితురాలికి అండగా నిలవాలని కోరుతూ అమెరికా, యూరప్ నుంచి ఎంతో మంది మహిళలు తనకు మెసేజ్ లు పంపుతున్నారంటూ ట్వీట్ చేశారు.

ఈ నేపథ్యంలో, పవన్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. ఎవరో యూరప్ లో ఉన్న మహిళ నీకు మెసేజ్ చేసి సపోర్ట్ చేయమని అడిగే వరకు ఒక ఆడపడుచుకు అవమానం జరిగిందన్న సంగతి నీకు తెలియక పోవడం సిగ్గు చేటని ఆమె ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. దళిత మహిళకు అన్యాయం జరిగిన వెంటనే వైసీపీ స్పందించిందని... నిందితులు అరెస్ట్ అయిన తర్వాత వైసీపీకి క్రెడిట్ వస్తుందనే భయంతోనే, ఈ రోజు కొందరు టీడీపీ ప్రభుత్వాన్ని నొప్పించకుండా ట్వీట్లు చేశారని ఎద్దేవా చేశారు.



roja
Pawan Kalyan
YSRCP
janasena

More Telugu News