pooja hegde: భారీ ఆఫర్ ను తిరస్కరించిన పూజా హెగ్డే!

షార్ట్స్‌లో చూడండి
సాధారణంగా క్రేజ్ ఉన్న హీరో .. హీరోయిన్లకు వ్యాపార ప్రకటనలు చేసే అవకాశాలు ఎక్కువగా వస్తుంటాయి. మంచి పారితోషికం ఇస్తే చాలు వాటిలో చేయడానికి వాళ్లు ఉత్సాహాన్ని చూపుతుంటారు. అయితే సహజత్వానికి దూరంగా వుండే వ్యాపార ప్రకటనలు చేయడానికి తాను ఎంత మాత్రం అంగీకరించనని పూజా హెగ్డే చెబుతోంది.

ఇటీవల ఓ సంస్థకి సంబంధించిన ప్రతినిధులు పూజాను కలిసి .. 'వెయిట్ లాస్ ప్రొడక్ట్' ను ప్రమోట్ చేయాలని కోరారట. అందుకు భారీ మొత్తమే పారితోషికంగా ఇస్తామని చెప్పినా గానీ, పూజ అంగీకరించలేదట. ట్యాబ్ లెట్స్ వాడటం వలన బరువు తగ్గుతారని మిస్ గైడ్ చేయడం తనకి ఇష్టం లేదని పూజా హెగ్డే అంటోంది. బరువు తగ్గడానికి సహజమైన పద్ధతులను అనుసరించడమే అన్ని విధాలా మంచిదని చెబుతోంది. ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామం చేస్తే బరువు తగ్గడం పెద్ద విషయం కాదని చెప్పుకొచ్చింది.         
Go Back to Shorts
pooja hegde

More Telugu News