amaranath reddy: పల్లెటూరిలో పుట్టిపెరిగా.. రోజా కంటే ఎక్కువగా వ్యాఖ్య‌లు చేయ‌గ‌ల‌ను: మ‌ంత్రి అమ‌ర‌నాథ్ రెడ్డి ఆగ్ర‌హం

  • రోజా ఇష్టం వ‌చ్చినట్లు వ్యాఖ్య‌లు చేస్తున్నారు 
  • ఆమె ఓ మహిళ కాబ‌ట్టి సంయమనం పాటిస్తున్నాను
  • నా కుటుంబంలో ఎవరిపైనా అవినీతి కేసులు లేవు
చంద్ర‌బాబు నాయుడి ప్రభుత్వం, ఏపీ మంత్రులు అంతా అవినీతిమ‌యం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా నిన్న ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. మహిళలపై జ‌రుగుతోన్న‌ దాడులపై ప్ర‌భుత్వాన్ని విమర్శించారు. దీనిపై స్పందించిన ఏపీ మంత్రి అమరనాథ్‌రెడ్డి.. రోజా ఇష్టం వ‌చ్చినట్లు వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఆమె ఓ మహిళ కాబ‌ట్టి తాను సంయమనం పాటిస్తున్నానని, తాను పల్లెటూరిలో పుట్టిపెరిగాన‌ని, తాను ఆమె కంటే ఎక్కువగా వ్యాఖ్య‌లు చేయ‌గ‌ల‌న‌ని అన్నారు. తాను పుట్టినప్పుడే మూడువేల ఎకరాల భూస్వామినని, త‌న‌ కుటుంబంలో ఎవరిపైనా అవినీతి కేసులు లేవని చెప్పారు.
amaranath reddy
roja
YSRCP
Telugudesam

More Telugu News