telangana: చంద్రబాబు కోసం ప్రపంచ తెలుగు మహాసభల తేదీలు మార్చడం కుదరదుగా?: నందిని సిధారెడ్డి

  • చంద్రబాబును పిలవలేదనడం తప్పు 
  • ఆయన హాజరయ్యేందుకు తేదీలు కుదర్లేదు
  • ఆ సమాచారం తెలిశాకే తెలుగు మహాసభలు నిర్వహించాం
ప్రపంచ తెలుగు మహాసభలకు ఏపీ సీఎం చంద్రబాబును పిలవలేదనడం తప్పని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘చంద్రబాబునాయుడుని ఆహ్వానించాలనే నిర్ణయం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. చంద్రబాబు హాజరయ్యేందుకు తేదీలు కుదర్లేదు. ఆ సమాచారం తెలుసుకున్న తర్వాతే మహాసభలు నిర్వహించాం. చంద్రబాబు కోసం ప్రపంచ తెలుగు మహాసభల తేదీలు మార్చడం కుదరదుగా? రెండు రాష్ట్రాల మధ్య జరగాల్సిన పంపకాలు పూర్తయితే తప్పా, ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయం పూర్తిగా రాదు’ అన్నారు.

telangana
Hyderabad

More Telugu News