devender goud: పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై దేవేందర్ గౌడ్ తనయుడి స్పందన

  • ఆపరేషన్ ఆకర్ష్ లో టీఆర్ఎస్, కాంగ్రెస్
  • దేవేందర్, వీరేందర్ పార్టీ మారుతున్నట్టు కథనాలు
  • టీడీపీని వీడబోమన్న వీరేందర్
2019 ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణలోని అధికార, ప్రతిపక్షాలు ఇతర పార్టీల నేతలను ఆకర్షించే పనిలో బిజీగా ఉన్నాయి. టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఉమా మాధవరెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. మరోవైపు ఎక్కువ మంది నేతలు అధికార టీఆర్ఎస్ లో చేరేందుకే మొగ్గు చూపుతున్నారు.

ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్, ఆయన కుమారుడు వీరేందర్ గౌడ్ లు పార్టీ మారుతున్నట్టు కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై వీరేందర్ గౌడ్ స్పందించారు. ఇదంతా అసత్య ప్రచారమేనని... తాము టీడీపీలోనే ఉంటామని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. 
devender goud
TRS
congress

More Telugu News