Narendra Modi: వచ్చే నెల ఏపీకి రానున్న మోదీ?

  • జనవరిలో ఏపీకి మోదీ
  • కోటిపల్లి-నర్సాపూర్ రైల్వేలైన్ శంకుస్థాపనకు ఆహ్వానించిన టీడీపీ ఎంపీలు
  • సానుకూలంగా స్పందించిన మోదీ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో ఏపీలో పర్యటించే అవకాశం ఉందని టీడీపీ అమలాపురం ఎంపీ రవీంద్రబాబు, కాకినాడ ఎంపీ తోట నర్సింహం తెలిపారు. ఈరోజు వారు ఢిల్లీలో మోదీని కలిశారు. కోటిపల్లి-నర్సాపూర్ రైల్వేలైన్, గౌతమి బ్రిడ్జ్ ల శంకుస్థాపనకు రావాలని ఈ సందర్భంగా కోరారు. టీడీపీ ఎంపీల విన్నపానికి మోదీ సానుకూలంగా స్పందించారు. అనంతరం తోట, రవీంద్రబాబులు మీడియాతో మాట్లాడుతూ శంకుస్థాపనకు రావడానికి ప్రధాని సుముఖత చూపారని చెప్పారు. జనవరిలో ప్రధాని పర్యటన ఖరారవుతుందని అన్నారు. 
Narendra Modi
thota narsimham
gowthami

More Telugu News