Venkaiah Naidu: వెంకయ్యనాయుడికి చికాకు తెప్పిస్తున్న రాజ్యసభ సమావేశాలు

  • సభా సమయాన్ని, ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారు
  • కీలక బిల్లులపై చర్చ జరగడం లేదు
  • పరిస్థితులు దిగజారుతున్నాయి
ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడు రాజ్యసభ చైర్మన్ హోదాలో తొలిసారి సమావేశాలను నిర్వహిస్తున్నారు. అయితే, సమావేశాలు కొనసాగుతున్న తీరు ఆయనకు పరమ చికాకును తెప్పిస్తోంది. ఢిల్లీలో జరిగిన ఓ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ, తన మనసులోని అసంతృప్తిని బహిరంగపరిచారు. ప్రస్తుతం మన పార్లమెంట్ సమావేశాలు ఇలా మొదలవుతున్నాయ్, వెంటనే ఆగిపోతున్నాయని... ఇది దేశానికి ఎంత మాత్రం మంచిది కాదని ఆయన అన్నారు.

ప్రజా ప్రతినిధుల నిరసన కార్యక్రమాలతో సభా సమయం వృథా అవుతోందని, ప్రజాధనం దుర్వినియోగమవుతోందని చెప్పారు. నేతలందరూ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. పరిస్థితులు నానాటికీ మరింతగా దిగజారుతున్నాయని అన్నారు. కీలకమైన బిల్లులపై చర్చించే పరిస్థితి కూడా కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మన్మోహన్ పై మోదీ వ్యాఖ్యలకు నిరసనగా రాజ్యసభ సమావేశాలకు అంతరాయం కలుగుతున్న సంగతి తెలిసిందే. 
Venkaiah Naidu
rajyasabha

More Telugu News