raviteja: రవితేజ ఆగడం లేదు .. జనవరిలోనే వచ్చేస్తున్నాడు

షార్ట్స్‌లో చూడండి
'రాజా ది గ్రేట్' తో హిట్ కొట్టిన రవితేజ .. తన తదుపరి చిత్రమైన 'టచ్ చేసి చూడు'తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ఆయన పాత్ర కూడా ఇంతవరకూ చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు.

 ఈ సినిమా సంక్రాంతి బరిలోకి దిగుతున్నట్టుగా వార్తలు వచ్చాయి .. కానీ అందులో నిజం లేదు. ఎందుకంటే రవితేజ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమాను విడుదల చేయనున్నారు. జనవరి 26వ తేదీన రవితేజ పుట్టిన రోజు .. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఒక రోజు ముందుగా .. అంటే జనవరి 25న ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చేశారు. నల్లమలుపు బుజ్జి .. వల్లభనేని వంశీ నిర్మిస్తోన్న ఈ సినిమాలో, రవితేజ సరసన రాశి ఖన్నా .. శీరత్ కపూర్ లు నటించారు.      
Go Back to Shorts
raviteja
rashi khanna

More Telugu News