Vijayawada: గన్నవరంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడి!
కృష్ణా జిల్లా గన్నవరంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ లో జరిగిన ఈ సంఘటనలో టీడీపీ కార్యకర్తలు బుట్టు రుషి, నార్ల సురేష్, అరుణ్ కు తీవ్రగాయాలైనట్లు సమాచారం. కాగా, వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు సందర్భంగా గన్నవరంలో ఆ పార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నిర్వహిస్తున్న సందర్భంలోనే, ఉద్దేశ్యపూర్వకంగా వైసీపీ వాళ్లు తమపై దాడికి పాల్పడ్డారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.