Hyderabad: హైదరాబాద్ లో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిపై పెట్రోల్ పోసి తగులబెట్టిన వైనం!

  • లాలాగూడలో దారుణ సంఘటన
  • తనను ప్రేమించడం లేదంటూ ఓ యువతిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన ప్రేమోన్మాది
  • డెబ్భై శాతానికి పైగా కాలిపోయిన యువతి శరీరం
హైదరాబాద్ లో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తనను ప్రేమించలేదని యువతిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన దారుణ సంఘటన లాలాగూడలో జరిగింది. సంధ్యారాణి(22) అనే యువతి తనను ప్రేమించడం లేదంటూ కార్తీక్ అనే ప్రేమోన్మాది ఈ దారుణానికి పాల్పడ్డాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఆమెపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు.

ఈ సంఘటనలో 70 శాతానికి పైగా ఆమె శరీరం కాలిపోయింది. సంధ్యారాణి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరోపక్క, నిందితుడు కార్తీక్ కోసం పోలీసులు గాలింపు చేబట్టారు. కాగా, బాధితురాలు సంధ్యారాణి స్థానిక శాంతినగర్ లో లక్కీ ట్రేడర్స్ లో పనిచేస్తోంది. 
Hyderabad
gandhi hospital
love

More Telugu News