కోడెల: ఏపీ స్పీకర్ కోడెల ఇంటికి తెలంగాణ శాసనసభాపతి.. పరస్పరం కుశల ప్రశ్నలు!
- తిరుమల వెళ్తూ మార్గమధ్యంలో కోడెల ఇంటికి వెళ్లిన మధుసూదనాచారి కుటుంబసభ్యులు
- ఆప్యాయంగా ఆహ్వానించిన కోడెల
- మా ఇధ్దరిది మూడు దశాబ్దాల స్నేహం: కోడెల
- దీవెనల కోసం మా అబ్బాయినే ఇక్కడికి తీసుకొచ్చా: మధుసూదనా చారి
ఏపీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు ఇంటికి తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి వెళ్లారు. తన కుటుంబసభ్యులతో కలిసి రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్లూ మార్గమధ్యంలో కోడెలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి కుటుంబసభ్యులను కోడెల ఆప్యాయంగా ఆహ్వానించారు. శాసనసభాపతులిద్దరూ పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నారు.
ఈ సందర్భంగా కోడెల మీడియాతో మాట్లాడుతూ, ‘మధుసూదనాచారి గారికి, నాకు మూడు దశాబ్దాల స్నేహం, అనుబంధం, ఆత్మీయత ఉన్నాయి. ఒక పార్టీలో నాడు కలిసి పనిచేశాం. తెలంగాణ సభాపతిగా ఈరోజున ఆయన బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఏ సమస్య వచ్చినా పరిష్కారం కోసం మేమిద్దం ముచ్చటించుకుంటూ ఉంటాం. మా ఇద్దరి స్పీకర్ల మధ్యనే కాదు, ఇధ్దరు ముఖ్యమంత్రుల మధ్య కూడా ఉన్న ఈ సయోధ్య, స్నేహం రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగపడాలని మనసారా కోరుకుంటున్నాను’ అన్నారు.
అనంతరం, మధుసూదనాచారి మాట్లాడుతూ, ‘బిజీ షెడ్యూల్ కారణంగా మా అబ్బాయి పెళ్లికి ఆయన రాలేకపోయారు. మా బాబునే ఇక్కడికి తీసుకువచ్చి, వారి దీవెనలు ఇప్పించాలనుకుంటున్న విషయాన్ని ఆయనకు నేను చెబితే.. ‘తప్పకుండా రండి. గుంటూరులో ఇంట్లోనే ఉంటా’ అని చెప్పారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతో ఆత్మీయంగా మా కుటుంబసభ్యులందరినీ ఆహ్వానించారు. మా సీనియర్ నాయకులు, గౌరవ ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి అయినటువంటి కోడెల శివప్రసాద్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు’ చెబుతున్నానని అన్నారు.