అనూ ఇమ్మాన్యుయేల్ డిమాండ్ అలా పెరిగిపోతోంది!
- అనూ ఇమ్మాన్యుయేల్ కి పెరుగుతోన్న క్రేజ్
- 'అజ్ఞాతవాసి'తో పాటు 'నా పేరు సూర్య'లోను ఆమెనే
- చరణ్ తదుపరి చిత్రంలో ఛాన్స్
- సాయిధరమ్ తేజ్ మూవీలోనూ ఛాన్స్
పవన్ సరసన నటించిన ఈ సుందరి, బన్నీ జోడీగా 'నా పేరు సూర్య' చేస్తోంది. చరణ్ - బోయపాటి కాంబినేషన్లోని సినిమాలోనూ ఈ అమ్మాయినే తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ చేయనున్న సినిమా కోసం కూడా ఈ అమ్మాయినే అడిగారట. ఇందుకోసం అమ్మడు పారితోషికంగా భారీ మొత్తమే అడిగిందని టాక్. ఇక మారుతి - నాగ చైతన్య సినిమాలోనూ అనూ ఇమ్మాన్యుయేల్ చేస్తోన్న సంగతి తెలిసిందే.