జగన్: జగన్ కు సంతోషకరమైన జీవితం ప్రసాదించాలని కోరుకుంటున్నా: బర్త్ డే విషెస్ చెప్పిన చంద్రబాబు

  • వైఎస్ జగన్ పుట్టినరోజు సంతోషంగా జరుపుకోవాలి
  • మంచి ఆరోగ్యం ప్రసాదించాలని దేవుడ్ని కోరుకుంటున్నా
  • ఓ ట్వీట్ చేసిన చంద్రబాబు
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వైసీపీ అధినేత జగన్ కు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా జగన్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. ‘వైఎస్ జగన్ పుట్టినరోజు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా. దేవుడు ఆశీర్వదించాలని.. మంచి ఆరోగ్యంతో పాటు సంతోషకరమైన జీవితం ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అని తన ట్వీట్ లో చంద్రబాబు పేర్కొన్నారు. కాగా, అనంతపురం జిల్లాలో ప్రజాసంకల్పయాత్రలో ఉన్న జగన్ .. ప్రజల సమక్షంలో తన పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు. ఓ భారీ కేక్ కట్ చేశారు. 
జగన్
చంద్రబాబు

More Telugu News