rajamouli: మళ్లీ ప్రభాస్ తో ఇప్పట్లో సినిమా లేదు!: రాజమౌళి

షార్ట్స్‌లో చూడండి
రాజమౌళి తదుపరి సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా .. ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తదుపరి సినిమా మల్టీ స్టారర్ గా వుండనుందనీ, ఒక హీరోగా ఎన్టీఆర్ .. మరో హీరోగా చరణ్ చేయనున్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి. ఇక ఈ సినిమా తరువాత మరో భారీ సినిమాను తెరకెక్కించడానికి కూడా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారనీ, ఆ సినిమాలో ప్రభాస్ నటించనున్నాడనే వార్త ఫిల్మ్ నగర్లో జోరుగా షికారు చేస్తోంది.

 దాంతో ఈ ప్రచారం పట్ల రాజమౌళి స్పందిస్తూ .. 'నేను, ప్రభాస్ కలిసి 5 సంవత్సరాల పాటు పనిచేశాం. అందువలన కొంతకాలం పాటు కలిసి సినిమాలు చేయడకూడదని నిర్ణయించుకున్నాం. ఎవరి కమిట్మెంట్స్ వాళ్లకి వున్నాయి. అందువలన ఇప్పట్లో ప్రభాస్ తో సినిమా ఉండదు .. భవిష్యత్తులో ఆయనతో సినిమా చేసే అవకాశమైతే వుంది" అని చెప్పుకొచ్చారు.      
Go Back to Shorts
rajamouli
prabhas

More Telugu News