adi pinishetty: కథానాయికగా రితికా సింగ్ మరో ఛాన్స్ కొట్టేసింది!

  • హరి దర్శకత్వంలో ఆది పినిశెట్టి 
  • కొంత గ్యాప్ తరువాత హీరోగా 
  • కథానాయికలుగా తాప్సీ .. రితికా సింగ్          
'గురు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు రితికా సింగ్ చేరువైంది. ఆ తరువాత 'శివలింగ'లో లారెన్స్ తో చేసి నటనలో మరింత పరిణతిని చూపించింది. దాంతో తెలుగు .. తమిళ భాషల్లో ఆమెను వెతుక్కుంటూ అవకాశాలు వస్తున్నాయి. అయితే తనకి బాగా నచ్చిన పాత్రలను మాత్రమే ఆమె అంగీకరిస్తూ వస్తోంది. అలా తాజాగా ఆమె దర్శకుడు 'హరి'కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

 ఆది పినిశెట్టి కథానాయకుడిగా ఒక సినిమాను తెరకెక్కించడానికి హరి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికల అవసరం వుంటుందట. దాంతో ఒక కథానాయికగా తాప్సీని తీసుకున్నారు. మరో కథానాయిక పాత్ర కోసం కొంతమంది పేర్లను పరిశీలించి, చివరికి రితికా సింగ్ ను ఎంపిక చేశారట. కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో, ఆది పినిశెట్టి అంధుడిగా నటించనుండటం విశేషం.   
adi pinishetty
rithika singh

More Telugu News