jagan: జగన్ బంధువులు టీడీపీలో చేరనున్నారు: టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న

  • జగన్ పాదయాత్రకు బిట్ కాయిన్ దందా డబ్బులు
  • టీడీపీ నేతలపై బురద చల్లడమే రోజా పని
  • బీజేపీ నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా, తాము చిరునవ్వుతో స్వాగతిస్తాం 
  • వీర్రాజు వ్యవహారాన్ని చంద్రబాబు చూసుకుంటారు 
బిట్ కాయిన్ కుంభకోణంలో వచ్చిన సొమ్మును జగన్ పాదయాత్రకు రామకృష్ణారెడ్డి మళ్లించారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ఏపీలో వైసీపీ పని అయిపోయిందని... సాక్షాత్తు జగన్ బంధువులు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎంతసేపూ టీడీపీ నేతలపై బురద చల్లడమే రోజా పని అంటూ మండిపడ్డారు. టీడీపీ, బీజేపీలు కలసికట్టుగా ముందుకు సాగుతున్నాయని... బీజేపీ నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా, తాము చిరునవ్వుతో స్వాగతిస్తామని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యవహారాన్ని తమ అధినేత చంద్రబాబు చూసుకుంటారని అన్నారు.
jagan
budda venkanna
roja
YSRCP

More Telugu News