pavan kalyan: క్రిస్మస్ మరుసటి రోజునే 'అజ్ఞాతవాసి' ట్రైలర్

షార్ట్స్‌లో చూడండి
'అజ్ఞాతవాసి' సినిమాపైనే ఇప్పుడు సినీ ప్రియులు దృష్టి పెట్టారు. ఈ నెల 16వ తేదీన వదిలిన ఈ సినిమా టీజర్ కి అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక 19వ తేదీన జరిగిన ఆడియో వేడుక కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ నెల 25వ తేదీన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదలాలనుకున్నారు. కానీ తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, ఈ ట్రైలర్ ను క్రిస్మస్ మరుసటి రోజున, అంటే 26వ తేదీన విడుదల చేయనున్నారట.

పవన్ కల్యాణ్ చెప్పిన ఓ పవర్ఫుల్ డైలాగ్ పై ఈ ట్రైలర్ ను కట్ చేస్తున్నట్టుగా సమాచారం. పవన్ ఫ్యాన్స్ మెచ్చేలా .. సినిమాపై మరింత భారీగా అంచనాలు పెరిగేలా ఈ ట్రైలర్ ఉండనుందట. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, వచ్చేనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ జోడీగా కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా అలరించనున్నారు.   
Go Back to Shorts
pavan kalyan
keerthi suresh
anu emmanuel

More Telugu News