Sachin Tendulkar: రాజ్యసభలో మొదటిసారి ప్రసంగించనున్న సచిన్ టెండూల్కర్
- ఇవాళ మధ్యాహ్నం 2 గం.లకు మాట్లాడనున్న సచిన్
- క్రీడల భవిష్యత్తు అంశం మీద ప్రసంగం
- సభ వాయిదా పడితే కష్టమే!
భారత జట్టు మాజీ ఆటగాడు, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ మొదటిసారి రాజ్యసభలో ప్రసంగించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు క్రీడల భవిష్యత్తు, ఆట ఆడే హక్కుల గురించి ఆయన ఉపన్యసిస్తారు. గత ఐదేళ్లుగా సచిన్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పటికీ ఆయన ఎన్నడూ ప్రసంగించలేదు. వచ్చే ఏడాదితో ఆయన పదవీ కాలం ముగియనుంది.
అయితే ఆయన తొలి ప్రసంగానికి కొన్ని అడ్డంకులు తగిలే అవకాశం ఉంది. ఇవాళ రెండు సభల్లోనూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల గురించిన అంశాన్ని లేవనెత్తనున్నట్టు కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. ఒకవేళ ఈ అంశానికి సంబంధించిన చర్చ వల్ల సభ వాయిదా పడితే సచిన్ ప్రసంగించలేకపోవచ్చు.