Yuzvendra Chahal: టీ20లో టీమిండియా బౌలర్ చాహల్ రికార్డు!

  • ఈ ఏడాది ఇప్పటి వరకు 19 వికెట్లు తీసిన చాహల్
  • ఒకే కేలండర్ ఇయర్‌లో అత్యధిక వికెట్ టేకర్‌గా రికార్డు
  • రెండో స్థానంలో ఆఫ్ఘాన్, విండీస్ బౌలర్లు రషీద్ ఖాన్, విలియమ్స్
హరియాణాకు చెందిన రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ టీ20లలో అద్భుత ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది అత్యధిక వికెట్లు పడగొట్టిన వాడిగా రికార్డులకెక్కాడు. బుధవారం కటక్‌లో శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో చాహల్ నాలుగు  వికెట్లు పడగొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ ఏడాది మొత్తం 10 మ్యాచులు ఆడిన చాహల్ మొత్తం 19 వికెట్లు నేలకూల్చాడు.

ఈ కేలండర్ ఇయర్‌లో ఇన్ని వికెట్లు తీసిన బౌలర్ చాహల్ ఒక్కడే. అతడి తర్వాతి స్థానంలో ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్, విండీస్ పేసర్ క్రెసిక్ విలియమ్స్‌లు 17 వికెట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నారు. శ్రీలంకతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండడంతో ఈ ఏడాది పొట్టి  క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా చాహల్ నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
Yuzvendra Chahal
India
Wickets
T20

More Telugu News