Tamannaah: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • మరో తమిళ చిత్రానికి ఓకే చెప్పిన తమన్నా 
  • సల్మాన్ సినిమాకి తెలుగు రచయిత కథ
  • పవన్ కోసం వెంకటేష్ రెండు రోజుల షూటింగ్!
  • సునీల్ చిత్రానికి సెన్సార్ పూర్తి    
*  ఓపక్క తెలుగు, హిందీ సినిమాలతో బిజీగా వున్న మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా తాజాగా ఓ తమిళ చిత్రాన్ని కూడా అంగీకరించింది. ఉదయనిధి స్టాలిన్ హీరోగా శీను రామస్వామి దర్శకత్వంలో రూపొందే తాజా చిత్రంలో తమన్నా నాయికగా నటించనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కాగా, ఇప్పటికే విక్రం సరసన ఈ ముద్దుగుమ్మ నటించిన 'స్కెచ్' చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది.
*  బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటించే చిత్రానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ కథను సమకూరుస్తున్నాడు. సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ దర్శకత్వం వహించే 'షేర్ ఖాన్' చిత్రానికి కోన వెంకట్ కథను అందిస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది సెట్స్ కి వెళుతుంది.
*  పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న 'అజ్ఞాతవాసి' చిత్రంలో సీనియర్ నటుడు వెంకటేష్ గెస్ట్ పాత్రను పోషించారు. ఇందుకోసం వెంకటేష్ రెండు రోజుల పాటు ఈ చిత్రం షూటింగులో పాల్గొన్నట్టు సమాచారం.
*  సునీల్ హీరోగా ఎన్.శంకర్ దర్శకత్వంలో రూపొందిన '2 కంట్రీస్' చిత్రం సెన్సార్ పూర్తయింది. మనీషా రాజ్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేస్తున్నారు. 
Tamannaah
Salman Khan
Pawan Kalyan
venkatesh

More Telugu News