krishnamraju: నా గురించి చెడుగా రాశాడు .. నాకు కోపం వచ్చిందని తెలిసి నా ఇంటికి వచ్చేశాడు!: కృష్ణంరాజు

  • నా గురించి లేనిపోనివి రాశాడు 
  • అనవసరంగా నాకు కోపం తెప్పించాడు 
  • నన్ను చూడగానే పారిపోయేవాడు
తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడిన కృష్ణంరాజు .. తనకి అన్యాయం చేసిన వాళ్లు తన ఇంటికి వచ్చినా క్షమించి పంపించేసేవాడినంటూ, అందుకు ఉదాహరణగా ఒక సంఘటనను గురించి చెప్పారు. " నెల్లూరులో ఓ వ్యక్తి ఆ రోజుల్లో కార్డు పేపర్ రన్ చేసేవాడు. ప్లాప్ .. యావరేజ్ .. 50 రోజులు .. అదీ ఇదీ అంటూ సినిమా వార్తలను రాసేవాడు. ఎందుకనో తెలియదుగానీ ఓ రోజున నా గురించి  చెడుగా రాశాడు

అది చూసిన నేను .. ఎందుకిలా రాశాడు? అంత అవసరం ఏముంది? అనుకున్నాను. ఈ విషయంలో నాకు కోపం వచ్చిందనే విషయం ఆయనకి తెలిసింది. దాంతో భయపడిపోయి .. నాకు కనిపించకుండా తప్పించుకుని తిరిగేవాడు. "అలా పారిపోవడం ఎందుకూ .. కృష్ణంరాజు ఇంటికే వెళ్లిపో .. ఇంటికి వెళ్లిన వాళ్లని ఆయన ఏమీ అనరు" అని ఎవరో చెప్పారట. దాంతో ఓ రోజున మా ఇంటికి వచ్చేశాడు .. తలుపు తీయగానే నమస్కారం చేశాడు. ఇంకెప్పుడూ ఇలా జరగదు .. పొరపాటైపోయిందని అన్నాడు. దాంతో నేను ఆయనని ఏమీ అనకుండా .. అవమానపరచకుండా పంపించివేశాను" అంటూ చెప్పుకొచ్చారు. 
krishnamraju

More Telugu News