rk nagar: ఆర్కేనగర్ ఉప ఎన్నికలో ఆయనే గెలుస్తాడు: బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి జోస్యం
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కేనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రేపు ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలో పోటీ దినకరన్‌కు, డీఎంకేకి మధ్యనే ఉందని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. అంతేకాదు, దినకరన్ గెలిచి డీఎంకే నేత స్టాలిన్‌కు గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు.
దినకరన్‌కు, డీఎంకేకు అధికార పార్టీ అసలు పోటీనే కాదని చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం రాష్ట్రానికి ఎటువంటి మంచి పనులు చేయలేదని, వారిద్దరూ అసమర్థులని అన్నారు. డీఎంకే పార్టీ హిట్లర్ పార్టీ అని, దాని నుంచి దినకరన్ మాత్రమే ప్రజలను కాపాడగలడని అన్నారు.