Allu Arjun: తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించిన అల్లు అర్జున్!

  • ప్రపంచ తెలుగు మహాసభలు అత్యద్భుతం
  • తెలుగు గొప్పదనాన్ని చాటి చెప్పారు
  • చాలా గర్వంగా ఉంది
ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా నిర్వహించిందని సినీ హీరో అల్లు అర్జున్ ప్రశంసించాడు. తెలుగు సాహిత్యం, సంస్కృతిని చాటి చెప్పేందుకు ప్రభత్వం నిర్వహించిన కార్యక్రమం అత్యద్భుతమని ట్వీట్ చేశాడు. టీఎస్ ప్రభుత్వాన్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నానని చెప్పాడు.

తెలుగు మహాసభలు విజయవంతం కావడం ఎంతో గర్వంగా ఉందని తెలిపాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ 'నా పేరు సూర్య' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది.
Allu Arjun
Tollywood

More Telugu News