‘అజ్ఞాతవాసి’: 2018లో రాబోతున్న బ్లాక్ బస్టర్ హిట్ ‘అజ్ఞాతవాసి’!: దిల్ రాజు
- పవన్ కల్యాణ్ ఏం చేసినా మనకు నచ్చుతుంది
- పవన్ కి త్రివిక్రమ్ తోడైతే బ్లాక్ బస్టర్ హిట్టే
- ‘అజ్ఞాతవాసి’ ఆడియో వేడుకలో దిల్ రాజు
2018లో రాబోతున్న బ్లాక్ బస్టర్ హిట్ ‘అజ్ఞాతవాసి’ అని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. ‘అజ్ఞాతవాసి’ సినిమా ఆడియో వేడుకలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ‘ మీ అందరికీ గుర్తుందో లేదో! ‘బద్రీ’ సినిమా విడుదలప్పుడు ఒక పోస్టర్ కూడా వేయలేదు. ఆడియో రిలీజ్ చేయలేదు. డైరెక్టుగా సినిమా విడుదలై రికార్డులు బద్దలు కొట్టింది.
‘అజ్ఞాతవాసి’ ఆడియోను ఇంత వేడుకగా విడుదల చేస్తుంటే రేపు ఏం జరగబోతోంది! 2018లో తెలుగు సినిమాకు రాబోతున్న బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘అజ్ఞాతవాసి’. నేను ఇంత గట్టిగా ఎందుకు చెబుతున్నానంటే .. కల్యాణ్ గారు ఏం చేసినా మనకు నచ్చుతుంది. కల్యాణ్ గారికి త్రివిక్రమ్ తోడైతే ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’..ఇప్పుడు ‘అజ్ఞాతవాసి’ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది’ అని అన్నారు.