ముద్రగడ పద్మనాభం: నా స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులకు ఓ విజ్ఞప్తి: ముద్రగడ పద్మనాభం

  • బీసీ రిజర్వేషన్ ఫలాలు అందే వరకూ ఏ పండగ చేసుకోను
  • 2018 కొత్త సంవత్సర వేడుకలకూ దూరంగా ఉంటా 
  • బీసీ రిజర్వేషన్లు పొందడమే అసలైన పండగగా భావిస్తా
కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు బీసీ రిజర్వేషన్ ఫలాలు అందే వరకూ ఏ పండగ చేసుకోననే విషయాన్ని మరోమారు గుర్తు చేస్తున్నానని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 2018 కొత్త సంవత్సర వేడుకలకూ దూరంగానే ఉంటానని, మన సామాజిక వర్గాలు ఆశించిన మేరకు రిజర్వేషన్లు పొందడమే అసలైన పండగగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

ఆ అసలైన పండగ కోసం..ఆరోజు కోసమే తాను కూడా నిరీక్షిస్తున్నానని తెలిపారు. జనవరి 1న తనను కలిసేందుకు, శుభాకాంక్షలు చెప్పేందుకు కిర్లంపూడికి వచ్చే ప్రయత్నం చేయవద్దని తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు, స్నేహితులకు విజ్ఞప్తి చేస్తున్నానని తన ప్రకటనలో ముద్రగడ పేర్కొన్నారు.
ముద్రగడ పద్మనాభం
కిర్లంపూడి

More Telugu News