coach of the year: 'కోచ్ ఆఫ్ ది ఇయ‌ర్' అవార్డు అందుకున్న‌ అనిల్ కుంబ్లే

షార్ట్స్‌లో చూడండి
2016, జులై నుంచి ఈ ఏడాది మార్చి వ‌ర‌కు భార‌త జ‌ట్టు కోచ్‌గా సేవ‌లందించి వ‌రుస‌గా ఐదు టెస్టుల్లో భార‌త జ‌ట్టు విజ‌యానికి కార‌ణ‌మైనందున మాజీ కోచ్ అనిల్ కుంబ్లేను కోచ్ ఆఫ్ ది ఇయ‌ర్‌గా గుర్తిస్తూ స్పోర్ట్స్ రైట‌ర్స్ అసోసియేష‌న్ ఆఫ్ బెంగ‌ళూరు అవార్డును అంద‌జేసింది. భారత మహిళా హాకీ జట్టు కోచ్ హరేందర్ సింగ్ చేతుల మీదుగా అనిల్ కుంబ్లే ఈ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు కుంబ్లే తెలిపాడు.

అవార్డు విజేతల పూర్తి జాబితా..

బెస్ట్‌ స్పోర్ట్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌(పురుషులు): సునీల్‌ చెత్రి

బెస్ట్‌ స్పోర్ట్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్(మహిళలు):అదితి అశోక్‌

టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌: బెంగళూరు ఎఫ్‌సీ

కోచ్‌ ఆఫ్‌ ద ఇయర్‌: అనిల్‌ కుంబ్లే

లైఫ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు: ఎమ్‌పీ గణేశ్‌

అసోసియేషన్‌ ఆఫ్‌ ద ఇయర్‌: కర్ణాటక బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌
Go Back to Shorts
coach of the year
anil kumble
Karnataka

More Telugu News