somu veerraju: మోదీ వల్లే నారా లోకేష్ కు 20 ప్రైజులు వచ్చాయి: బీజేపీ నేత సోము వీర్రాజు

  • ఏపీ కోసం కేంద్రం ఎంతో చేస్తోంది
  • మోదీ ఫొటో కూడా వేయడం లేదు
  • రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కాకూడదా?
ఏపీలో బీజేపీని బలోపేతం చేస్తామని చెప్పడమే తప్పైపోయిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఏపీ కోసం బీజేపీ ఎంతో చేస్తోందని... పోలవరం, పట్టిసీమలకు సహకరిస్తోందని చెప్పారు. మోదీ చేపట్టిన కార్యక్రమాల వల్లే మంత్రి నారా లోకేష్ కు 20 ప్రైజులు వచ్చాయని అన్నారు. కేంద్రం నిధులు ఇస్తున్న కార్యక్రమాలకు కూడా మోదీ ఫొటోను వాడటం లేదని... అడగ్గా అడగ్గా లోకేష్ పక్కన మోదీది చిన్న బొమ్మ పెట్టారని అసహనం వ్యక్తం చేశారు.

బీజీపీ బలపడుతున్న ప్రతిసారి ఏదో ఒక చోట ప్రత్యేక హోదా అంటున్నారని మండిపడ్డారు. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న తర్వాత కూడా... ప్రత్యేక హోదా అంటూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరంకు కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందంటూ ఎక్కడో ఒక చోట రచ్చ చేస్తున్నారని అన్నారు. ఏపీలో టీడీపీ బలోపేతం కావచ్చు కాని, బీజేపీ కాకూడదా? అని ప్రశ్నించారు. ఒక వేళ బీజేపీతో పొత్తు వద్దని భావిస్తే... ఆ విషయాన్ని చంద్రబాబు ఓపెన్ గా చెప్పాలని అన్నారు. ఇప్పుడున్నది ఆనాటి బీజేపీ కాదని, ఆనాటి నేతలు కూడా కాదని స్పష్టంగా చెప్పారు వీర్రాజు. 
somu veerraju
BJP
Chandrababu
Nara Lokesh
Telugudesam

More Telugu News