manjima mohan: హద్దులు దాటే గ్లామర్ పాత్రలు చేయలేను: మంజిమా మోహన్

  • పద్ధతిగా కనిపించే పాత్రలే చేస్తాను 
  • అవకాశాలు తగ్గినా ఫరవాలేదు 
  • నేను చేయతగిన పాత్రలు నాకు వస్తాయి
మలయాళంలో మంజిమా మోహన్ కి అభిమానుల సంఖ్య ఎక్కువ. ఎందుకంటే అక్కడ ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేసింది. ఇక కథానాయికగా తమిళ .. మలయాళ సినిమాల్లో నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తూనే, తెలుగులో 'సాహసం శ్వాసగా సాగిపో' చేసింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో, ఆమెకి ఇక్కడ మళ్లీ  అవకాశాలు రాలేదు.

 తాజాగా ఆమె మాట్లాడుతూ .. " గ్లామర్ గా కనిపించడం అంటే నేను అనుకునే కోణం వేరు .. ఇతరులు ఆలోచించే విధానం వేరు. కథానాయికలు అందంగా కనిపించవలసిందే .. అయితే అది హద్దులు దాటనంతవరకే అనేది నా ఉద్దేశం. ఎక్స్పోజింగ్ కి గ్లామర్ అనే పేరు తగిలించేస్తే చేయడానికి మాత్రం నేను సిద్ధంగా లేను. ఈ కారణంగా అవకాశాలు తగ్గుతాయనే సంగతి నాకు తెలుసు. కానీ ఫలానా పాత్ర మంజిమా చేస్తేనే బాగుంటుందనుకునే వాళ్లు వున్నారు. అందువలన నేను చేయదగిన పాత్రలు నన్ను వెతుక్కుంటూ వస్తాయనే నమ్మకం వుంది" అంటూ చెప్పుకొచ్చింది.      
manjima mohan

More Telugu News