Chandrababu: గతంలో చంద్రబాబు కాంగ్రెస్ తో కలసి పనిచేశారు: సోము వీర్రాజు

  • నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా కాంగ్రెస్ తో కలసి పని చేశారు
  • చంద్రబాబును బీజేపీ ఎంతో ఆదరించింది
  • బీజేపీ స్థాయి ఏంటో అందరికీ తెలుసు
నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో కాంగ్రెస్ తో కలసి పని చేశారని ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో చంద్రబాబు పలువురిని ప్రధానమంత్రులను చేశారని చెప్పారు. ఆయన ముమ్మాటికీ కాంగ్రెస్ కు మిత్రుడే అని విమర్శించారు. బీజేపీ స్థాయి గురించి టీడీపీ నేతలు మాట్లాడటం సరైంది కాదని చెప్పారు. వాజ్ పేయి నుంచి మోదీ వరకు బీజేపీ స్థాయి ఏంటో అందరికీ తెలుసని అన్నారు. మీ స్థాయి ఏంటని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించడం దారుణమని అన్నారు. పొత్తులో భాగంగా చంద్రబాబును తాము ఎంతో ఆదరించామని... చంద్రబాబు ఏది అడిగినా వాజ్ పేయి చేసేవారని తెలిపారు. 2009లో విడిగా ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు గెలవలేకపోయారని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాలనలో దేశం ఎంతో నష్టపోయిందని వీర్రాజు అన్నారు. గుజరాత్ ఎన్నికలు ఆషామాషీ కాదని... దేశ భవిష్యత్తుకు సంబంధించి ఓటర్లు తీర్పు ఇచ్చారని చెప్పారు. నోట్ల రద్దు, జీఎస్టీపై దుష్ప్రచారం చేసినప్పటికీ ప్రజలు నమ్మలేదని అన్నారు.
Chandrababu
somi veerraju
Telugudesam
Telugudesam
BJP

More Telugu News