Chandrababu: ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పై చంద్రబాబు ఫైర్!

  • టీడీపీపై సోము వీర్రాజు వ్యాఖ్యలు
  • ఘాటుగా స్పందించిన రాజేంద్రప్రసాద్
  • బీజేపీ నేతలపై విమర్శలు చేయవద్దన్న బాబు

టీడీపీ ఎమ్మెల్సే వైవీబీ రాజేంద్రప్రసాద్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలపై రాజేంద్రప్రసాద్ విమర్శలు చేయడాన్ని ఆయన సీరియస్ గా తీసుకున్నారు. పార్టీ అనుమతి లేకుండా ఇలాంటి చర్యలకు పాల్పడటాన్ని తప్పుబట్టారు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమైన వేళ ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, టీడీపీపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన రాజేంద్రప్రసాద్.... బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు.

దీనిపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. సోము వీర్రాజులాంటివారి వ్యాఖ్యలను వారి విచక్షణకే వదిలివేయాలని... పార్టీ అనుమతి లేకుండా బీజేపీ నేతలపై టీడీపీ నేతలెవరూ కామెంట్లు చేయవద్దని ఆయన ఆదేశించారు. ఇకపై ఇలాంటి విమర్శలు చేయవద్దంటూ రాజేంద్రప్రసాద్ కు హెచ్చరికలు జారీ చేశారు.

Chandrababu
yvb rajendraprasad
somu veerraju
  • Loading...

More Telugu News