Allu Arjun: సొంత నిర్మాణ సంస్థ ఏర్పాటు దిశగా బన్నీ

  • నిర్మాణ రంగంలో పవన్ .. మహేశ్ .. చరణ్ 
  • ఆ దిశగా బన్నీ అడుగులు
  • సొంత బ్యానర్ పై త్వరలోనే సినిమా  
ఒక వైపున హీరోలుగా వరుస సినిమాలు చేస్తూ .. మరో వైపున నిర్మాతలుగాను సక్సెస్ కావడానికి కొంతమంది హీరోలు రంగంలోకి దిగారు. పవన్ కల్యాణ్ .. మహేశ్ బాబు .. చరణ్ ఇప్పటికే సొంత నిర్మాణ సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. సొంత బ్యానర్ పై అవసరమైతే తమ సినిమాలు .. లేదంటే ఇతర హీరోల సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు.

 ఈ నేపథ్యంలో బన్నీ కూడా సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ నిర్మాణ సంస్థలో తాను ఏ సినిమా చేయాలనే విషయంలోనూ ఆయన పూర్తి స్పష్టతతో వున్నాడని అంటున్నారు. 2018 ఏప్రిల్ లో ఈ బ్యానర్లో సినిమా ఉంటుందని చెబుతున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం వుంది. ప్రస్తుతం ' నా పేరు సూర్య' చేస్తోన్న బన్నీ, ఆ తరువాత సినిమాను వి.ఐ. ఆనంద్ తో చేయనున్నట్టు సమాచారం.
Allu Arjun

More Telugu News