ఇక ఏపీలో ఎన్నికల సందడి... కర్నూలులో మొదలైన నామినేషన్ల స్వీకరణ
- శిల్పా చక్రపాణి రాజీనామాతో ఖాళీ
- 26 వరకూ నామినేషన్ల స్వీకరణ
- టీడీపీ టికెట్ కోసం భారీ పోటీ
- చంద్రబాబు నిర్ణయమే ఫైనల్!
ఇక అభ్యర్థి ఎంపిక టీడీపీకి కత్తి మీద సవాలేనని రాజకీయ విశ్లేషకుల అంచనా. రెండు రోజుల క్రితం ఆ పార్టీ జిల్లా నేతలతో అధిష్ఠానం ఓ సమావేశాన్ని నిర్వహించింది. సీఎం చంద్రబాబు నిర్ణయమే ఈ విషయంలో ఫైనల్ అని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మాల్దీవుల పర్యటనలో కుటుంబంతో సహా ఉన్న చంద్రబాబునాయుడు, అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత కర్నూలు ఎమ్మెల్సీ టికెట్ పై తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం.