యార్లగడ్డ లక్ష్మీప్రసాద్: నాడు నా క్రమశిక్షణకు పునాది వేసింది వాళ్లిద్దరే: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
- నా క్రమశిక్షణకు పునాది వేసింది వెంకయ్యనాయుడు, హరిబాబు
- చిలిపి పనులు చేస్తే ఆప్యాయంగా వెంకయ్య మందలించేవారు
- హరిబాబు పెద్దమనిషి తరహాతో చెప్పేవారు
- నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న ప్రొఫెసర్ యార్లగడ్డ
నాడు తన క్రమశిక్షణకు పునాది వేసిన వాళ్లు వెంకయ్యనాయుడు, హరిబాబు అని ప్రముఖ సాహితీ వేత్త, ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీనారాయణ అన్నారు. ‘ఏబీఎన్-ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ లో ఆయన మాట్లాడుతూ, ‘చిన్నప్పుడు ఎప్పుడైనా నేను చిలిపి పనులు చేస్తే.. నాయుడు గారు (వెంకయ్యనాయుడు) నన్ను చాలా ఆప్యాయంగా మందలించే వారు. హరిబాబు ఏమో ఓ చిరునవ్వు నవ్వి..‘మనకెందుకయ్యా! ఇవన్నీ!’ అని పెద్దమనిషి తరహాతో చెప్పేవారు. విజయవాడ, గుంటూరులో యలమంచిలి శివాజీ, సుంకర సత్యనారాయణ, వడ్డే శోభనాద్రీశ్వరరావులతో కలిసి ఉండేవాడిని. దీంతో, నాకు తెలియకుండానే ఒక విధమైన పెద్దరికం నాకు వచ్చింది. చిలిపి పనులు చేసే వీలులేకుండా పోయింది’ అని యార్లగడ్డ గుర్తుచేసుకున్నారు.