krishanamraju: అలా సినిమాల్లోకి వచ్చాను: కృష్ణంరాజు

  • ఆ దర్శకుడు నన్ను చూశారు
  • నాతో ఒక నాటకం వేయించారు 
  • నా నటన చూసి ఛాన్స్ ఇచ్చారు 
  • 'చిలక - గోరింక'తో మొదలు     
ఒక వైపున ఎన్టీఆర్ .. ఏఎన్నార్, మరో వైపున కృష్ణ .. శోభన్ బాబు హీరోలుగా వెలుగుతున్నారు. అలాంటి సమయంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్న కథానాయకుడు కృష్ణంరాజు. తాజాగా ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను ముచ్చటించారు. " ఇండస్ట్రీకి మీరు వచ్చినప్పుడు గాడ్ ఫాదర్ గా ఎవరైనా ఉన్నారా? లేదంటే ఎవరి అండదండలు లేకుండానే ఇండస్ట్రీకి వచ్చారా?" అనే ప్రశ్న కృష్ణంరాజుకి ఎదురైంది.

అప్పుడాయన స్పందిస్తూ .. "ఎవరి అండా లేకుండా పరిచయం జరగడం కష్టం కదా .. నన్ను పరిచయం చేసింది 'ప్రత్యగాత్మ' గారు. ఆయన నన్ను చూసి "బాగున్నాడే .. కొత్త హీరోగా పరిచయం చేయవచ్చు" అనుకున్నారు. అప్పుడు 'పరివర్తనం' అనే నాటకం వేయమన్నారు నన్ను. అంతకుముందు వరకూ నేను నాటకాలు వేయలేదు. ఆయన చెప్పాడు కదా అని ఆ నాటకం వేశాను .. ఆయన చూశారు .. "ఇతనే నా సినిమా హీరో" అంటూ అక్కడే చెప్పేశారు. అలా ఆయన నాతో 'చిలక - గోరింక' తీశారు" అని చెప్పుకొచ్చారు.     
krishanamraju

More Telugu News