Sunny Leone: చారిత్ర‌క చిత్రం కోసం స‌న్నీ లియోన్ పారితోషికం రూ. 3.25 కోట్లు!

  • వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి షూటింగ్ 
  • నాలుగు భాష‌ల్లో తెర‌కెక్కనున్న చిత్రం
  • యువ‌రాణి పాత్ర‌లో స‌న్నీ
బాలీవుడ్ అందాల తార స‌న్నీ లియోన్ మొద‌టిసారి ఓ చారిత్ర‌క క‌థాంశంతో న‌డిచే సినిమాలో న‌టించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం కోసం ఆమె రూ. 3.25 కోట్ల పారితోషికం డిమాండ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కుతున్న చిత్రం కావ‌డంతో ఆమె అడిగిన మొత్తం ఇవ్వ‌డానికి నిర్మాత స్టీఫెన్ ఒప్పుకున్న‌ట్లు స‌మాచారం.

ఈ చిత్రానికి త‌మిళ ద‌ర్శ‌కు‌డు వడి వుడయన్‌ దర్శకత్వం వహించనున్నారు. ఇంకా టైటిల్‌ ఖరారు కాని ఈ చిత్రంలో సన్నీ యువరాణి పాత్రలో నటించనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి సినిమా చిత్రీకరణ మొదలుకానుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ద‌క్షిణాదిలో అతిథి పాత్ర‌లు, ప్ర‌త్యేక పాట‌ల‌కే ప‌రిమిత‌మైన స‌న్నీ, పూర్తిస్థాయి క‌థ‌లో క‌నిపిస్తే చూడాల‌ని ఆమె అభిమానులు ఆశ‌గా ఎదురుచూస్తున్నారు.
Sunny Leone
remuneration
historical film
telugu
tamil
malayalam

More Telugu News