allu arjun: 'ఎక్కడికిపోతావు చిన్నవాడా' దర్శకుడితో అల్లు అర్జున్!

  • బన్నీకి కథ వినిపించిన అని కన్నెగంటి 
  • కథ పై హక్కులు కొనేసిన బన్నీ 
  • వి.ఐ.ఆనంద్ కి దర్శకత్వ బాధ్యతలు
'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాతో దర్శకుడు వి.ఐ.ఆనంద్ అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. తన తదుపరి చిత్రమైన 'ఒక్క క్షణం'తో ఈ నెల 28వ తేదీన ఆయన ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన అల్లు అర్జున్ తో చేయనున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్.

 గతంలో మంచు మనోజ్ తో 'మిస్టర్ నూకయ్య' సినిమా చేసిన దర్శకుడు అని కన్నెగంటి, ఇటీవల అల్లు అర్జున్ ను కలిసి ఒక కథ చెప్పాడట. బన్నీకి ఆ కథ నచ్చడంతో భారీ మొత్తం చెల్లించి కొనేశాడంటూ వార్తలు వచ్చాయి. తాను హీరోగా ఆ కథను తెరకెక్కించే బాధ్యతను ఆయన వి.ఐ.ఆనంద్ కి అప్పగించినట్టుగా చెప్పుకుంటున్నారు. ఒకరిద్దరు దర్శకులకు బన్నీ ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఉన్నప్పటికీ, 'నా పేరు సూర్య' తరువాత సినిమాను మాత్రం వి.ఐ.ఆనంద్ తోనే చేయనున్నాడని అంటున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.         
allu arjun
vi anand

More Telugu News